డిల్లీ, బతుకమ్మ : భారత్, రష్యా స్నేహం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు పరస్పరం ప్రయోజనాలు కలిగిస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం పుతిన్ తో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. భారత వా ణిజ్యానికి రష్యా అండగా నిలుస్తుందన్నారు. యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తున్న అన్నారు. ఆర్థిక ప్రణాళిక పై 2030 వరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయని మోదీ అభివర్ణించారు.
భారత రష్యా మధ్య కీలక ఒప్పందాలు
భారత పర్యటనలో ఉన్న రష్యాధ్యక్షుడు పుతిన్ శుక్రవారం హైదరాబాద్ హౌస్ లో మోడీతో బీటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో వీరు పాల్గొన్నారు. వాణిజ్యం, రక్షణ రంగం, కెమికల్స్, ఫర్టిలైజర్స్, వలస విధానం సహా పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. ఇరుదేశాల నేతల సమక్షంలో ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు ఆయా దేశాల అధికారులు మార్చుకున్నారు.
