30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓటు చోరీ  తోనే బిజెపి అధికారంలోకి వస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి

 డిచ్ పల్లి, బతుకమ్మ :

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గా,  నియంత దోరణిలో ముందుకు వెళ్తూ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. బీహార్ లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు చోరీ చేసింది కాబట్టి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డిచ్ పల్లి  మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బ్రెజిల్ దేశానికి చెందిన ఒక నటికి సంబంధించి దాదాపు 22 ఓట్లు దేశంలో ఓటరుగా నమోదై ఉన్నాయాని ఆమె మన దేశ పౌరురాలు కానప్పటికి నకిలీ ఓట్లు సృష్టించి ఆ రాష్టం లో అధికారంలోకి వచ్చింధనడానికి నిధర్శనం అన్నారు.  హర్యానా లో దాదాపు 25 లక్షల ఓట్లు 12.5%నకిలీ ఓట్లు  పోలయ్యాయి వాటితోనే బీజేపీ పార్టీ గెలిచిందన్నారు. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకాలు అని మండిపడ్డారు. అదేవిధంగా త్వరలో జరగబోయే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లో కూడా అదే విధంగా గెలవాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. బిజెపి ఓట్ చోరిపై యువ నేత రాహుల్ గాంధీ యువతలో మార్పు తెచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ లో ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓట్లు వేస్తారు అని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను ప్రజలు అదరిస్తారని నగేష్ రెడ్డి అన్నారు. ఈ  విలేఖరుల  సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి గారు, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి విక్కీ యాదవ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు యాదగిరి, డిచ్ పల్లి మాజీ ఎంపీపీ నర్సయ్య, కం చెట్టి గంగాధర్, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

BJP comes to power through vote theft

More articles

Latest article