28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళను దోచుకున్న ఒకరి అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ : బస్సు కోసం  వేచి ఉన్న మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి  బంగారం దోచుకొని పారిపోయిన  వ్యక్తిని అరెస్టు చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న  నందిగాం కు చెందిన సార్గం గంగమణి ఆమె భర్త సుభాష్ తన కుటుంబ సభ్యులతో బోధన్ లోని తన కూతురు వద్దకు వెళ్లి, తిరిగి సాయంత్రం నందిగాం కు బయలుదేరగా తన భర్త, కొడుకు, కోడలు ఒక బైక్ పై వెళ్లినట్లు తెలిపారు. గంగామణి మాత్రం బస్సు  ద్వారా బోధన్ నుంచి జానకంపేట వరకు వచ్చి యంచ వెళ్ళుటకు బాసర వైపు వెళ్ళు బస్ కోసం వేచి ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని నందిగాం గ్రామ శివారులో బెదిరించి 2 తులల పుస్తేలతడు, ఫోన్ గుంజుకొని ఆమెను వడ్ల కుప్ప పైన నేట్టేసి యంచ పైపు పారిపోయినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం సి సి కెమరాలు, కాల్ డేటా లను విశ్లేషించి బోధన్ లోని ఉత్పల్లికి చెందిన  నిందితుడు పట్లోత్ శ్రీకాంత్ ను  అరెస్టు చేసి, అతని వద్ద పుస్తేల తాడు స్వాధీన పరుచుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.. ఈ కేసును ఛేధించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్, ఏఎస్ఐ గఫ్ఫార్, సిబ్బంది రాజేశ్వర్, దత్తు, రాకేష్, రాజిరెడ్డి లను నిజామాబాద్ నార్త్ రూరల్ సి ఐ శ్రీనివాస్  అభినందించారు.

More articles

Latest article