30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాలో 10 ఆర్వోబి లు పూర్తి చేయాలనేది నా టార్గెట్

Must read

📰 Generate e-Paper Clip

జిల్లాలో 10 ఆర్వోబి లు పూర్తి చేయాలనేది నా టార్గెట్

…ఆర్వోబీలకు నిధులు విడుదల చేసిన భట్టికి ధన్యవాదాలు

.. పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి

నిజామాబాద్, బతుకమ్మ :


 

ఆర్వోబీలకు పెండింగ్ లో ఉన్న 13.5 కోట్లు విడుదల చేసినందుకు మంత్రి భట్టికి పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆర్ ఓబి పనులు యుద్ద ప్రాతిపదికన పనులు చేయమని చెప్పామని,అర్సపల్లి ఆర్వోబి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ తొందరగా చేయించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఆర్వోబీ పెండింగ్ ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలన్నారు.42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అన్నారు.సదువుకునేటోళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్, బీసీలకు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఇస్తదా అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 17 శాతమే రిజిస్ట్రేషన్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ దొంగనాటకం బయటపడిందన్నారు.ఆరు గ్యారంటీల అమలు రేవంత్ రెడ్డితో చేతకావడం లేదని,కేంద్ర నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు.ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని,పార్టీ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ ను ప్రజలు చీత్కరిస్తరని ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు.ఓట్ల కోసమే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల ప్రకటన చేస్తున్నారని ఆరోపించారు.

More articles

Latest article