29 C
Hyderabad
Monday, August 3, 2026

విచారణకు డీఈవో హాజరుకావాల్సిందే

Must read

📰 Generate e-Paper Clip

  • డిస్ట్రిక్ హ్యూమన్ రైట్స్ కోర్టు జడ్జి హరీషా
  • ఎమ్మెల్యే పీఏగా టీచర్ పని చేయడంపై కోర్టు ఆగ్రహం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరుకాకపోవడంతో జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు ( ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్) జడ్జి హరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈవో తరపున విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ హాజరుకావడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే పీఏగా పని చేస్తుండడంపై సామాజిక కార్యకర్త బొడ్డు గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి విద్యాశాఖాధికారులు శ్రీనివాస్ రెడ్డి పీఏగా పని చేయడానికి సెలవులు మంజూరు చేయడంపై సహ చట్టం ద్వారా ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన  కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ నెల మొదటి వారంలో డిఈవో అశోక్, ధర్పల్లి ఎంఈవోకు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం సంబంధిత కేసులో విచారణ జరిగింది. జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు న్యాయమూర్తి హరీషా ఎదుట పిటిషన్ తరపున న్యాయవాది బాల్ రాజ్ నాయక్ వాదనలు వినిపించారు. విద్యాశాఖాధికారులు ఏ విధంగా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసేందుకు సహాయ సహకారాలు అందించారని వివరించారు. సంబంధిత కేసులో సహ చట్టం ద్వారా దరఖాస్తులు చేసినా విద్యాశాఖాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. సంబంధిత ఆర్టీఐ సమాచారం కోసం అప్పిలేట్ అధికారికి ఫిర్యాదు చేయాలని వారు సమాచారం ఇవ్వని పక్షంలో కోర్టు తరపున తామే తెప్పిస్తామని చెప్పారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ వారిని ఆదేశించారు.  సంబంధిత కేసులో డిఈవో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును డిసెంబర్ 30కి వాయిదా వేశారు.

More articles

Latest article