30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ కలప రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకొంటామని కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ హెచ్చరించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి అక్రమ కలప రవాణా చేస్తున్న అరపేట కు చెందిన పతంగి సంపత్ గౌడ్ ను, కలప రవాణాకు వినియోగించిన ట్రాక్టర్ ను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ వరుణ్ లతో కలిసి పట్టుకొన్నారు. కలపతో ఉన్న ట్రాక్టర్ ను రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో ఉంచి, సంపత్ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ ఆర్ ఓ తెలిపారు. ఇలాంటి అక్రమ కలప రవాణా చేసే వారి గురించి భాద్యత గా తమకు సమాచారం ఇవ్వాలని, అటవి సంపదను కాపాడాలని ఏఫ్ ఆర్ ఓ ప్రజలను కోరారు.

Strict action against illegal timber trafficking

More articles

Latest article