26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కేజీబీవీలో మరమ్మతు పనులకు నిధులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ,ఏర్గట్ల : మండల కేంద్రములో కేజీబీవి స్కూల్ లో మరమ్మతులు,రిపేర్ పనులు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకంలో 11 లక్షల నిధుల పనులకు భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించిన గ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారి జుంగల శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏర్గట్ల గ్రామ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ పాల్గొని కేజీబీవీ స్కూల్ లో సమస్యల మరమత్తులకు నిధులు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ధనసరి సీతక్క, దృష్టికి తీసుకురావటంతో ఇట్టి నిధులు మంజూరు ఇప్పించడంతో గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.అట్లాగే పోలీస్ స్టేషన్ వద్ద గల ప్రైమరీ స్కూల్ కు కూడా రిపేర్ గురించి భవిత పథకం ద్వార 3 లక్షలు మంజూరు అయినవని శివన్నోళ్ల శివకుమార్ తెలిపారు. వాటి పనులు కూడ త్వరలో  ప్రారంభం అవుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమములో ముస్కు మోహన్ రెడ్డి,గడ్డం జీవన్ రెడ్డి, కూరాకుల బొర్రన్న,బద్దం లింగారెడ్డి,పన్నాల నర్సారెడ్డి, దండేవోయిన సాయన్న, సుధానవేణి శ్రీనివాస్ గౌడ్, దండేవోయిన సాయి,మదస్తూ చిన్న గంగారాం,సున్నపు గణపతి, సంగీమ్ గంగాధర్, ఇబ్రహీంపట్నం చిన్న గంగాధర్, గఫూర్,సలీం,రాము, కేజీబీవీ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article