25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పడాల పురందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : ఆరోగ్యకరమైన జీవన శైలిని గడిపేందుకు అందరు ఆహార నియమాలను పాటిస్తూ, ఆరోగ్య నియమాలను పాటించాలని లయన్స్ క్లబ్ భీమ్ గల్ ప్రెసిడెంట్ పడాల పురందర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా  మండలంలోని బడా భీమ్ గల్ లో లయన్స్ క్లబ్ భీమ్ గల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షుగర్ వ్యాధికి కారణం ఆహరపు అలవాట్లు, మన జీవన శైలే ప్రధాన కారణమని అన్నారు. మన లైఫ్ స్టైల్ ను మార్చుకొని, రోజు వ్యాయమం చెయ్యాలన్నారు.ఈ వైద్య శిభిరం లో షుగర్ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హనుమండ్లు,గజ్జెల చైతన్య,  క్లబ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్. శ్రీకాంత్ రామావత్, సహాయ కో ఆర్డినేటర్ భూక్యా లింబాద్రి,క్లబ్ సభ్యులు ధనుంజయ్, ర్యాడా శ్రీనివాస్, పీ.యర్.ఓ పురస్తు లింబాద్రి  సహా లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article