31.7 C
Hyderabad

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసరస్వతి శిశు మందిర్ లో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్బంగా చిన్నారుల్లో ఉన్న కళను దృష్టిలో పెట్టుకొని కళ సృజనత్మకతను బయటికి తీసుకువచ్చేందుకు గాను ముఖ్య అతిథి సుదీర్ బాబు పర్యవేక్షణలో చిన్నారులకు డ్రాయింగ్ పోటీలను  నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానం లో చెప్పాల నిత్యశ్రీ, ద్వితీయ స్థానంలో అమృత్ కుమార్, తృతీయ స్థానంలో కె. అక్షయ్ లు నిలిచారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పడాల పురందర్, సెక్రటరీ గజ్జెల చైతన్య, వైస్ ప్రెసిడెంట్ హనుమండ్లు, లయన్స్ క్లబ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. శ్రీకాంత్ రామావత్, సహాయ కో ఆర్డినేటర్ భూక్యా లింబాద్రి,క్లబ్ సభ్యులు ర్యాడా శ్రీనివాస్, పీయర్ఓ పురస్తు లింబాద్రి, సహా లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాసా రవి కుమార్,అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జి పైడిమర్రి సాయిచరణ్,విద్యార్థులు,  క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Drawing competitions organized by Lions Club

More articles

Latest article