30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓటమికి కారణాలు విశ్లేషించుకొని ముందుకు సాగుతాం

Must read

📰 Generate e-Paper Clip

  • అధికార దుర్వినియోగం చేసి గెలిచిన కాంగ్రెస్
  •  ఎన్నికల్లో గెలుపొటములు సహజం  
  • తనకు బాధ్యత ఇచ్చిన శేఖ్ పేట్ లో బీఆర్ఎస్ కు మెజారిటీ
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును శీరసా వహిస్తామని, ఓటమికి గల కారణాలను తాము విశ్లేషించుకొని ముందుకు సాగుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితల అనంతరం ఆయన బతుకమ్మ తో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనకున్న అధికారం తో ప్రజాస్వామ్యాన్ని ఖుణీ చేసి అధికార యంత్రాంగాన్ని, ఇతర అన్ని వ్యవస్థలను ఈ ఉప ఎన్నికల్లో దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేసి ఓటర్లను మభ్యపెట్టిన, దొంగ ఓట్లు వేస్తున్న పోలీసులు, ఎన్నికల కమిషన్ చోద్యం చుసిందన్నారు. ఎన్నికలు అన్నకా గెలుపు, ఓటములు సహజమన్నారు. గత నెల రోజులు అక్కడే ఉండి బీయర్ ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన తన బాల్కొండ నియోజకవర్గం నాయకులను ఆయన అభినందించారు. తనకు ఇంచార్జ్ గా ఉన్న షేక్పెట్ డివిజన్ లోని 12 బూత్ ల లో బాల్కొండ నియోజక వర్గ బి ఆర్ ఎస్ నాయకులు బాద్యత తీసుకొని 1073 ఓట్ల మెజారిటీ తీసుక రావడం అట్లాగే 12 బూత్ లన్నిట్లో లీడ్ రావడం చాలా గొప్ప విషయం అని ఎమ్మెల్యే అన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నైతిక విజయం బీయర్ ఎస్ పార్టీదేనన్నారు. ఓటమిని కూడా సవాల్ గా తీసుకొని కాంగ్రెస్ ఇచ్చిన  హామీల అమలు కోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇకముందు కూడా పోరాడుతూనే ఉంటామన్నారు.

More articles

Latest article