26.2 C
Hyderabad

ఎన్నికల్లో గెలుపొటములు సహజం

Must read

📰 Generate e-Paper Clip

  • ఓటమికి గల కారణాలను విశ్లేసించుకుని ముందుకుపోతాం

 

బతుకమ్మ, వేల్పూర్:ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని ఓటమి గల కారణాలను విశ్లేషించి ముందుకు పోతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు . తాను ఇంచార్జ్ గా ఉన్న షేక్పెట్ డివిజన్ లోని 12 బూత్ ల లో బాల్కొండ నియోజక వర్గ బి ఆర్ ఎస్ నాయకులు బాద్యత తీసుకొని 1073 ఓట్ల మెజారిటీ తీసుక రావడం అట్లాగే 12 బూత్ లన్నిట్లో లీడ్ రావడం చాలా గొప్ప విషయం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్బంగా  నెల రోజులుగా అక్కడే ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారము నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని కూని చేసింది. అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థలన్నింటిని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ  దొంగ ఓట్లు వేస్తున్న పోలీసులు, ఎన్నికల కమిషన్ చోద్యం చూసింది. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే. ఓటమిని కూడా సవాల్ గా తీసుకొని కాంగ్రెస్ ఇచ్చిన ఇచ్చిన హామీల అమలు కోసము ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇకముందు కూడా పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు.

More articles

Latest article