మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,454 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏ ఈ ఈ రవి తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650కు క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు నిలువ ఉంది.
