30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాలో మోటర్ వెహికల్ ఆమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ  : జిల్లాలో మోటర్ వెహికల్ ఆమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం మత్తులో వాహనము నడిపిన వారిపై మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారము శిక్షార్హులని అన్నారు. మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 క్రింద డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారు శిక్షార్హులు  మొదటి సారి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టు బడినట్లయితే రూ.2వేలు లేదా 6 నెలల వరకు జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. మొదటి సారి పట్టు బడిన తరువాత 3 సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ పట్టు బడినట్లయితే రూ.3వేలు జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు విధించబుతుందని తెలిపారు. మోటర్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం డ్రంకెన్ డ్రైవ్లో పట్టు బడిన వారికి కోర్ట్ లో మొదటి సారి పట్టుబడిన వారికి రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష రెండు విందించబడుతుందని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో రెండో సారి పట్టు బడిన వారికి రూ.15వేలు జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడునని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేదా సస్పెండ్ చేయవచ్చని అన్నారు. తాగి రోడ్ ప్రమాదం చేసి ఎదుటి వారు మరణిస్తే ఐపీసీ సెక్షన్ 105 బీఎన్ఎస్ ( 304 II)  కింద కేసు నమోదు చేయబడును ఇట్టి సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలు వరకు జైలు లేదా జరిమానా లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష అని తెలిపారు. తాగి నడిపి ప్రమాదం చేసి ఎదుటివారు గాయలకు గురైతే సెకండ్ 110 బీఎన్ఎస్ (308 ఐపీసీ) కింద కేసు నమోదు చేయబడును ఇట్టి సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విందించబడునని తెలిపారు.  పోలీస్ బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించవచ్చు, పీరీక్ష నిరాకరించినా కూడా అదే సెక్షన్ కింద శిక్షించవచ్చునని తెలిపారు. ప్రతి వాహనాదారుడు రోడ్డు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటించాలని నిజాంబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హెచ్చరించారు.

More articles

Latest article