బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పనులకు ఇసుక పంపిణీ విషయంలో తగు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను అమ్మాలని అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు అమ్మినట్లయితే ప్రభుత్వపరంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలకు 4000 రూపాయలు. మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్, పిట్లం మండలాలకు 3500 రూపాయలు. బిచ్కుంద మండలానికి 2500 చొప్పున ఇసుకను పంపిణీ చేయాలని, అలాగే ట్రాక్టర్లకు, ట్రాలీలకు విధిగా నంబర్ ప్లేట్లను అమర్చాలని సూచించారు.
