27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందూరు జిల్లా కళాకారుల గడ్డ

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరు జిల్లా కళాకారుల గడ్డ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఇందూరు కళాభారతి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం పరిశీలించారు. కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలు, బకాయిలు, పెండింగ్లో ఉన్న నిర్మాణ భాగాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  సుమారు నాలుగు సంవత్సరాల క్రితం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గనికి కళాభారతి మంజూరు చేస్తున్నాం అన్నప్పుడు ప్రజలందరూ చాలా సంతోషపడ్డారని అన్నారు. ఇందూర్ నగరం అన్న, ఇందూరు జిల్లా అన్న కళాకారుల గడ్డ అని తెలిపారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూస్తే వేలాదిమంది కళాకారులు ఉన్నారని తెలిపారు. జిల్లాలలో జాతీయ అంతర్జాతీయకి స్థాయి ఎదిగిన కళాకారులు ఉన్నారన్నారు. వాళ్లందరికీ కూడా ఒక వేదిక వస్తుందని చాలా సంతోషపడ్డారన్నారు. కళాభవనానికి బడ్జెట్ రూ.116 కోట్లు.. మొదట  50 కోట్ల మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటివరకు 50 కోట్ల వరకు పూర్తి అయిందని తెలిపారు. సుమారు  27 కోట్ల బకాయిలు చాలా మట్టుకు ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయని కాంట్రాక్టర్ తెలిపారని అన్నారు.  దశాబ్దాల నుండి ఎదురుచూస్తున్న కళాభారతి భవనo పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భవనం పూర్తయితే స్టేట్ లెవెల్ పోటీలు ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో అధికారులు ఆర్ అండ్ బీ డీఈ ప్రవీణ్ కుమార్, ఏఈ సాయికుమార్, స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, మఠo పవన్, మారేవర్  కృష్ణ, బట్టికిరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Indore district is the land of artists.

Indore district is the land of artists.

More articles

Latest article