- టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్ని శాఖల ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను ఐడీఓసీలోని విద్యాశాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిబుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, టిఎన్జీవో ఉపాధ్యక్షులు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టిఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అన్వేష్, టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
