కోటగిరి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట రైతులు పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. రైతుల ధాన్యం సొసైటీకి విక్రయించాలంటే వ్యవసాయ శాఖ అధికారుల సంతకం అవసరం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు సమయం అయిపోయినప్పటికీ రాకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని కొత్తపల్లి రోడ్డు మార్గంలో రైతు వేదిక కార్యాలయం ఎదుట రైతులు పడిగాపులు కాస్తూ కూర్చున్నారు.
