28.2 C
Hyderabad

రచయిత అందెశ్రీ మరణం తీరని లోటు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ :  ప్రముఖ రచయిత, తెలంగాణా రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు యెనుగందుల శంకర్ అన్నారు.   ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అందెశ్రీ  ఉదయం ఇంట్లో కుప్పకూలి  గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం విదితమే.  1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో  అందేశ్రీ జన్మించారు.  జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.   కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌,  2006లో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు
2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్,2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు.  కుటుంబ సభ్యులందరు ధైర్యంగా మనోనిబ్బరం తో ఉండాలని  యెనుగందుల శంకర్ తెలిపారు.

More articles

Latest article