27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి భవనం కోటగల్లిలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు.  టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టియుసిఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు  వనమాల కృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు. టియుసిఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే.సూర్యం, ఎస్.ఎల్ పద్మ లు భారత కార్మికోద్యమం, కార్మిక హక్కులు, చట్టాలపై క్లాసులు బోధించారు. ఈ సందర్భంగా టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కేసూర్యం,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్ పద్మ లు మాట్లాడుతూ  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న నరేంద్ర మోడీ ఇప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలను అప్పగిస్తున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రతను దూరం చేస్తున్నదన్నారు. కార్మిక హక్కులను అడుగడుగునా కాలరాస్తున్నారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దుచేసి, కార్పొరేట్ కంపెనీలకు అనుకూల చట్టాలను తీసుకొస్తున్నారనీ ఆరోపించారు. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ లనీ అన్నారు. ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో గత కేసిఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటుఇటుగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మిక వర్గంపైనే ఉన్నదన్నారు. కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు తమ పాటలతో చైతన్యపరిచారు.  ఈ శిక్షణా తరగతుల్లో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా కోశాధికారి సాయరెడ్డి,  జిల్లా నాయకులు మురళి, రాజేశ్వర్, లింగం, కిరణ్, రవి, రెహనా వివిధ ప్రజాసంఘాల నాయకులు గోదావరి, కే.గణేష్, సాయిబాబా, అమూల్య, పద్మ, ఈశ్వరి, శోభ, సుమలత, సుజాత, లత, లాలయ్య శాంతి కుమార్, విజయ్, శ్రీధర్, రాజేశ్వర్, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు.

Let's destroy anti-labor policies.

More articles

Latest article