29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బర్కత్ పుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని గాజుల్ పెట్ బడా రామ్ మందిర్  బర్కత్ పురా పాఠశాలలో  అక్టోబర్ 2 న గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రిన్సిపల్ కృపాల్ సింగ్  అధ్యక్షతన పాఠశాల విద్యార్థులందరికీ “ఉచిత ఆరోగ్య పరిక్షలు” నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణుడు  డాక్టర్ మజాజ్ ఖాన్  మాట్లాడుతు వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వలన ప్రతి ఒక్కరు అనారోగ్యాల బారిన  పడుతున్నారని, కావున ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదని అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు, పి ఆర్ టి యు  తెలంగాణ జిల్లా అద్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ చిన్నతనం లో పోషక ఆహరం లోతం ఉంటుందని, సమర్పన ఆహరం తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు డయేరియా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు సోకకుండా  జాగ్రత్తలు తీపుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం డాక్టర్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి జలుబు, దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు తదితర సమస్యల కు సంబంధించి మందుల ను అందజేశారు. కార్యక్రమం లో మహేశ్ తో పాటు పాఠశాల సిబ్బంది  జ్యోత్స్న, సుచిత్ర, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Health camp for students at Barkat Pura Government School

More articles

Latest article