29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయం

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

 

ఇందల్వాయి, బతుకమ్మ : ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు భాగంగా హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజలకు జనాధారణ ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. దీంతో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ప్రచార అగ్రహారం కార్యక్రమంలో ఐసిడిఎస్ వాళ్ల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article