29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి విస్తృత ప్రచారం 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : 

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శ్రమిస్తున్నారు. గురువారం ఆయన ఎర్రగడ్డ డివిజన్‌లోని గౌతమ్‌పూరి కాలనీలో విస్తృత పర్యటన నిర్వహించారు.317 బూత్‌ల పరిధిలో ప్రజలను కలుస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాలనీలో ప్రజలతో మాట్లాడిన భూపతిరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి” అంటూ ప్రజలను కోరారు.ప్రతి ఒక్కరు ఈ నెల 11న తమ తమ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతా రావు, గౌతమ్‌పూరి కాలనీ ఇన్‌చార్జి రవి గౌడ్, సురేష్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్, మాజీ ఎంపిటీసీ శంకర్, కాలనీ అధ్యక్షులు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

MLA Bhupathi Reddy campaigned extensively in Jubilee Hills

More articles

Latest article