25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

యూపీలో రైలు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఛత్తస్ గడ్ లో రైలు ప్రమాద ఘటన మరువక ముందు యూపీలో మరో  రైలు  ప్రమాదం చోటు చేసుకుంది.  మీర్జాపూర్ లో బుధవారం యాత్రికులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. యాత్రికులు  కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో సాన్నాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసి వెళ్తుండగా ఈప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. యాత్రికులు చోపాన్ ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రైలులో చునార్ రైల్వేస్టేషన్ కు చేరుకొని  ప్లాట్ ఫాం  వైపు దిగకుండా మరో వైపు ఉన్న పట్టాల వైపు దిగారు. అక్కడి నుంచి  ఎదురుగా ఉన్న ప్లాట్ ఫాం  వైపు వెళ్తుండగా  అదే సమయంలో వచ్చిన హౌరా – కల్కా నేతాజీ ఎక్స్ ప్రెస్ వీరిని ఢీకొంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.

More articles

Latest article