25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులకు శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలం లోని 38 గ్రామ సంఘాల ప్రతినిధులకు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద అధ్యక్షతన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ  సీనియర్ సి ఆర్ పి లు అనురాధ, శ్రీలత  మహిళా సంఘాల విధులు -బాధ్యత లు, గ్రామ సంఘం విధులు -బాధ్యత లు, పాలక వర్గం, కార్యవర్గ విధులు బాధ్యత లు, సంఘం గ్రామ సంఘం నిర్వహణ పద్ధతులు, సబ్ కమీటీల నిర్వహణ, పుస్తక నిర్వహణ, సంఘాల బలోపేతం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం మొదలగు అంశాల పై రెండు రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు మహానంద ఏపీఎం రవీందర్, సీనియర్ సి అర్ పి లు అనురాధ, శ్రీలత , అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, సీసీ లు, అకౌంటెంట్ హాజరయ్యారు.

Training for Mandal Federation Executive Committee members

More articles

Latest article