25.4 C
Hyderabad

శబరిమల మహా పాదయాత్ర ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరు నుండి కేరళలోని పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం వరకు సుమారు 1500 కి.మీ. మహా పాదయాత్రను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “భక్తి, నియమ నిష్టలు మన భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక పునాది. నిజామాబాద్ నుండి కేరళ వరకు జరుగుతున్న మహా పాదయాత్ర అనేది కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు.. అది ఆంతరిక సాధన, ఆత్మీయ మార్గం. ఇలాంటి పాదయాత్రలు యువతలో ధార్మిక చైతన్యాన్ని, నియమశీలతను పెంపొందించడంతో పాటు, సమాజంలో ఐక్యతను బలపరుస్తాయని తెలిపారు. ఈ మహా పాదయాత్రలో పురంశెట్టి నంద కిషోర్, నూరు రాజేందర్, వేణు, సాయిరెడ్డి, సుధాకర్, దీపక్, గంగా ప్రసాద్ తదితర భక్తులు పాల్గొన్నారు.

Sabarimala Mahapada Yatra begins

More articles

Latest article