ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడి సెంటర్లో పిల్లల యొక్క బరువులు అంగన్వాడీ టీచర్ శారద ఆశ వర్కర్ జ్యోతి తూకం వేశారు. అనంతరం ఆశ వర్కర్ మాట్లాడుతూ విష జ్వరాలపై వారికి అవగాహన కల్పించారు. పిల్లలకు తీసుకునే తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె అన్నారు. వారానికి రెండుసార్లు గుడ్లు పాలు పౌష్టికాహారం అంగన్వాడి సెంటర్లో లభిస్తుందని ఆమె అన్నారు. అనంతరం అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ.. మీ పిల్లలను సరైన టైంలో సెంటర్లో వదిలి పెట్టాలని ఆమె అన్నారు. బాలింతలు తీసుకొని జాగ్రత్తలు ఆకుకూరలు గుడ్లు, పాలు లాంటి పోస్ట్ కి ఆహారాలు తీసుకోవాలని శారద అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, ఆయా, జ్యోతి, పిల్లలు, బాలింతలు పాల్గొన్నారు.
