29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్బీ సీఐ వెంకటయ్య కు ఘనంగా వీడ్కోలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ శాఖలో సుదీర్ఘంగా 43 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి. వెంకటయ్య ను నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. “పోలీస్ శాఖలో ఒత్తిడిలోనూ అత్యంత నిబద్ధతతో సేవలందించి, ఎటువంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందడం విశేషం. పదవీ విరమణ తర్వాత కూడా శాఖ ఎల్లప్పుడూ మీకు తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు.

More articles

Latest article