నిజామాబాద్, బతుకమ్మ : సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జాహాన్ మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు శిక్ష, 12మంది జరిమాన విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. మద్యం తాగివాహనం నడిపిన 15మందికి గురువారం ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిలో 12మందికి రూ.18,500జరిమాన, ముగ్గురికి రెండురోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.