24 C
Hyderabad
Sunday, August 2, 2026

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి డబ్బులు లేక బైక్ లు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను 1వ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీక్లీ మార్కెట్ లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువకులు హెచ్ఎఫ్ డిలక్స్  టీఎస్ 16 ఈవీ 1553 నెంబర్ గల బైక్ వస్తుండగా వారిని ఆపిబైక్ పత్రాలు అడుగగా పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పట్టుకొని విచారించారు. వారు హనుమాన్ నగర్ కు చెందిన గజాబారే నగేష్, న్యాల్ కల్ రోడ్డుకు చెందిన హన్మంతే మోహన్ లు గా తెలిపారన్నారు. వారు నడుపుతున్న బైక్ ను మహాలక్ష్మి హాస్పిటల్ నుండి దొంగిలించినట్టు ఒప్పుకున్నారన్నారు. వారు చెడు అలవాట్లకు బానిసై డబ్బులు లేక బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలకు వాడుకోవచ్చనే ఉద్దేశంతో దొంగతనాలు చేస్తున్నట్టు తెలిపారన్నారు. వీరు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక బైక్ ను దొంగతనం చేసి దానిని వినాయక నగర్ కి చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తి కి విక్రయించినట్లు తెలిపారు. దొంగ బండి అని తెలిసి కూడా షేక్ గౌస్ కొనుగోలు చేశారు. అలాగే అర్యనగర్ లో ఒక టీవీఎస్ ఎక్స్ ఎల్ను, వీక్లీ మార్కెట్ లో మరొక బైక్ ను దొంగిలించి వాటిని రైల్వే స్టేషన్ వద్ద గల చెట్ల పొదల్లో దాచినట్టు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి మూడు బైక్ లను స్వాధీనపర్చుకుని, వీరితో పాటు దొంగ బైక్ ను కొన్న షేక్ గౌస్ ను కూడా పట్టుకొని అతని వద్ద నుండి కూడా బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.

More articles

Latest article