ఎంఎస్పీకి అదనంగా రూ.500బోనస్ ఇచ్చి పంటలను కొనుగోలు చేయాలి

0 2,421
  • మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, బతుకమ్మ :  కేంద్ర ప్రభుత్వం నిర్ణయయించిన ఎంఎస్పీ ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న,సోయాబీన్,వరి పంటలను  కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఆనాటి పిసిసి అధ్యక్షులు,ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా తమ ప్రభుత్వమే ఇచ్చి పంట కొనుగోలు చేస్తుందని వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పి మానిఫెస్టో లో పెట్టారని అన్నారు. రైతులు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పండించారని, ప్రస్తుతం పంట చేతికొచ్చిందని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారులు మొదట్లో క్వింటాలుకు రూ.2600 కొనుగోలు చేశారన్నారు. కానీ ప్రస్తుతం 2200 నుండి 2300 లకు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న పంట 2024 – 25 కి గాను కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంఎస్పీ ధర రూ.2225 నిర్ణయించిందని తెలిపారు.  రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్ తో కలిపి రూ.2725 కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సోయాబీన్ పంటకు  కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ  ధర రూ.4892 నిర్ణయించిందని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ ఇచ్చి 5392 రూపాయలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.  త్వరలో వరి పంట చేతికి రాబోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధర రూ.2300 నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 500 బోనస్ ఇచ్చి క్వింటాలుకు రూ.2800 ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. రుణమాఫీ అమలు కాకా రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షలు, మాజి ఎంపిపి, జెడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.