ఎంఎస్పీకి అదనంగా రూ.500బోనస్ ఇచ్చి పంటలను కొనుగోలు చేయాలి
మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం నిర్ణయయించిన ఎంఎస్పీ ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న,సోయాబీన్,వరి పంటలను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాటి పిసిసి అధ్యక్షులు,ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే క్వింటాలుకు 500 రూపాయలు అదనంగా తమ ప్రభుత్వమే ఇచ్చి...