- ’బతుకమ్మ‘ కథనానికి స్పందన
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించాడు. దీంతో “ప్రాణాలు తోడేసిన రోడ్డు” అనే కథనం బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ సిబ్బంది రోడ్డుపై ఉన్న గుంతలను పూర్తిగా మూసివేసి మండల కేంద్రంలో గల రోడ్డును పూర్తిగా శుభ్రపరచారు. దీంతో పంచాయతీ సిబ్బందిని పలువురు ప్రశంసించగా మరికొందరు ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ గుసగుసలాడుతున్నారు.
