- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
- పోలీస్ ప్రజావాణికి 11 ఫిర్యాదులు
నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి 11 అర్జీలను స్వీకరించారు. వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లో యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

