29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జ్యూవెల్లరీ షాప్ లో భారీ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

. . . గ్రైండింగ్ కట్టర్ తో షట్టర్ ను కోసి లోపలికి ప్రవేశంచిన అగంతకులు

. . వెండి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

. . .  నవిపేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఘటన

 బోధన్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. నవిపేట్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న బాసర ప్రధాన రహదారి పై ఉన్న వైష్ణవి సిల్వర్ మర్చంట్ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ముగ్గురు దొంగలు ముందు నగల దుకాణం వద్ద ఉన్న సీసీ కెమోరాలు ధ్వంసం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్రైండింగ్ కట్టర్ తో షట్టర్ ను కోసి లోపలికి ప్రవేశించి దోంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు  నగల షాప్ లో బంగారం, వెండితో పాటు నగదును ఎత్తుకెళ్ళారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ చోరీ తో నవీపేట వ్యాపార వర్గాలు ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా పనే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో గ్యాస్ కట్టర్ లో బ్యాంకులు, నగల షాపులలో చోరీలకు పాల్పడిన ముఠా చోరికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీకి పాల్పడిన ముఠా బైక్ పై వచ్చినట్టు సీసీ టివి పుటేజీ గుర్తించారు. పోలీసు టీం దొంగలు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దోంగలు చోరికి పాల్పడటం పోలీసులకు సవాల్ విసిరి నట్టైంది.

More articles

Latest article