25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హత్యాయత్నం గుట్టురట్టు

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : హత్యాయత్నానికి  ప్రయత్నించిన సంఘటన నందిపేట్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నందిపేట్ మండలం చింరాజ్ పల్లి శివారు లో గల భారత్ నగర్ కాలనిలో నివాసం ఉంటున్న మేకల మహేష్ ను చంపేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. వివరాలోకి వెళ్తే గత జనవరి నెలలో నందిపేట్ మండలకేంద్రం లో వ్యభిచార గృహాలపై పోలీస్ దాడులు నిర్వహించి వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మేకల ప్రకాష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమాచారం మేకల మహేష్ పోలీస్ వారికీ చేరవేర్చాడు అనే అనుమానం తో పగ పెంచుకొని నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడు. అంతే కాకుండా లత, రొడ్డ నరసయ్య అలియాస్ పెంటర్ దేవా లతో కలిసి మహేష్ ను హత మార్చేందుకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని  నిందితులను అదుపులోకి తీసుకొని హత్య కు సంబంధించిన ఫోన్ సంభాషణను  కూడా పరిశీలిస్తున్నట్లు ఎస్సై చిరంజీవి పేర్కొన్నారు.

More articles

Latest article