30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ అమరవీరులకు.. వారి కుటుంబాలను క్షమాపణ కోరుతున్నా

Must read

📰 Generate e-Paper Clip

  • ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు
  • 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది
  • ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  • ‘జనం బాట’ కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు

 

హైదరాబాద్, బతుకమ్మ : జనం బాట’ కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేశారు.  శనివారం హైద్రాబాద్ లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…..తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం మిగతా వారికి న్యాయం చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ  సాధించుకున్నాం. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి. పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన. అప్పుడు అమరవీరుల కుటుంబాలాకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పాను. కానీ మీకోసం నేను ఇంకా ఎక్కువగా కొట్లాడేది ఉండే అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా అని అన్నారు. తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే  ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా.  ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దాం.  ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తా. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా. మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందేనని కవిత అన్నారు.

Apologizing to the Telangana martyrs.. and their families

More articles

Latest article