27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉత్సాహంగా ప్రెషర్స్ డే వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: అహ్మద్ బి.ఎడ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం సందడిగా సాగాయి. భిక్కనూరు మండల కేంద్రంలోని బి.ఎడ్ కళాశాలో ద్వితీయ సంవత్సరo చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు  ప్రథమ సంవత్సర ఛాత్రో ఉపాధ్యాయులకు  ఘనంగా స్వాగతం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నృత్య ప్రదర్శనలు,మిమిక్రీ,పాటలు, మరియు జోక్స్ మొదలైన పలు ఆనంద కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ యం. డి హనీఫ్ పాషా మాట్లాడుతూ ప్రతి ఛాత్రోపాధ్యాయురాళ్లకు సహ పాఠ్య కార్యక్రమాలు అధ్యాపకులతో పరిచయం పెంచుకోవడానికి కళాశాల వాతావరణానికి అలవాటు పడడానికి ప్రెషర్స్ డే అనేది విద్యార్థి జీవితంలో కొత్త ప్రమాణానికి నాంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు మరియు  బోధనేతర సిబ్బంది ఉన్నారు.

Pressers Day celebrations with enthusiasm

More articles

Latest article