రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : వర్ని మండలంలోని జాకోర గ్రామంలో శనివారం రైతులకు 75 శాతం సబ్సిడీ పై స్ప్రే పంపులను వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాకోర పిఏసిఎస్ చైర్మన్ దశరథ్, ఏఎంసి డైరెక్టర్ రమేష్ గౌడ్, మైనారిటీ నాయకులు అబ్దుల్ బారి, కిసాన్ కేత్ అధ్యక్షులు శనిగరం కిషన్, బోడోల బాలయ్య, కూనిపూర్ మాజీ సర్పంచ్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
