30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసు అమరుల త్యాగాలు స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్, బతుకమ్మ :  పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ చేపట్టినట్లు  సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద సైకిల్, బైక్ ర్యాలీని ప్రారంభించి అందులో సీపీ పాల్గొన్నారు.   పూలాంగ్ చౌరస్తా నుంచి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా- కోర్టు చౌరస్తా – గ్లామర్ హోటల్ చౌరస్తా – చెన్నైయ్ షాపింగ్ మాల్ చౌరస్తా- ఆర్టీసీ బస్టాండ్ – ప్రభుత్వ హాస్పటల్- దేవిరోడ్డు చౌరస్తా -గాంధీ చౌక్ చౌరస్తా – నెహ్రూ పార్కు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ  అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వడమే  ఉద్దేశమన్నారు. పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.  వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్  పరిధిలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఈనెల 29న రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు  ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సురేష్, నగరంలోని పోలీస్​స్టేషన్ల ఎస్​హెచ్​వోలు ఇతర పోలీసు అధికారులు 12 ఎన్​సీసీ కేడెట్లు, స్కూల్ విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


Cycle rally to commemorate the sacrifices of police martyrs

 

More articles

Latest article