27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రజా వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, డీపీఓ శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ, డీఎల్పీవో నాగరాజు, బోధన్ ఎంపీడీవో మధుకర్, తహసీల్దార్ విఠల్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పెగడపల్లి వీడీసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి అబ్బన్న, కార్యదర్శి గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోతారెడ్డి, సుదర్శన్, మల్లారెడ్డి, ఒడ్డేన్న, షబ్బీర్, కృష్ణారెడ్డి, మోహన్, నాగరాజు గౌడ్, సైదా గౌడ్, అబ్బయ్య, భూమయ్య, నర్సారెడ్డి, జిపి రాజు తదితరులు పాల్గొన్నారు.

We are committed to infrastructure development.

More articles

Latest article