బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ సీఐ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న తుల శ్రీనివాస్ ను బాగ్వాన్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న సీఐ మండల అశోక్ ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తుల శ్రీధర్ కు బాగ్వాన్ సంఘం నాయకులు శాలువా కప్పి సత్కరించారు.ఈ సందర్బంగా పట్టణ పరిస్థితులపై మాట్లాడారు. ప్రజలు పట్టణ, గ్రామాల్లో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు కృషి చేయాలని సీఐ సూచించారు.ఈ కార్యక్రమంలో బాగ్వాన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ కాజీమ్, ఉపాధ్యక్షులు ఫాజిల్,మాజీ అధ్యక్షులు యూసుఫ్,రషీద్, ఇస్మాయిల్, ఫరూక్,బాగ్వాన్ సంఘం కమిటీ సభ్యులు రహీం, మైను, అకీఫ్ హుస్సేన్, అజాం, తదితరులు పాల్గొన్నారు.
