మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రజా వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు...