23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

రసాభాసగా బీర్కూర్ పీఏసీఎస్ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

బీర్కూర్, బతుకమ్మ :  బీర్కూర్ సహకార సంఘం సమావేశం గురువారం సహకార సంఘం కార్యాలయంలో సంఘ అధ్యక్షులు కొల్లి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు రైస్ మిల్లర్లతో కుమ్మకై రైతులను నట్టేట ముంచుతున్నారని రైతులు వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో రైతులు పెద్ద ఎత్తున సంఘం అధ్యక్షులు, సహకార సంఘం కార్యదర్శి విఠల్ పై మండిపడ్డారు. రైతులకు అండగా ఉండవలసిన బీర్కూరు సహకార సంఘం అవినీతికి అక్రమాలకు అడ్డగా మారిందంటూ రైతులు ఆరోపించారు. తక్షణం సంఘం అధ్యక్షులు గాంధీ, కార్యదర్శి విట్టల్ రాజీనామా చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో కార్యాలయం లో ఒకేసారిబీర్కూర్ పీఏసీఎస్ సమావేశం రసాభాస చోటుచేసుకుంది. రెండు గంటల పాటు సహకార సంఘం పనితీరుపై రైతులు, సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. బీర్కూర్ కు చెందిన ఒక రైస్ మిల్లుతో సహకార సంఘం నిర్వాహకుల కుమ్మక్కై వారికే రైతుల వద్ద నుంచి కొన్న ధాన్యం అంట కడుతున్నారని రైతులు ఆరోపించారు.

More articles

Latest article