26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్‌లో బంద్ విజయవంతం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్ : పార్లమెంట్‌లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపుపై బోధన్ నియోజకవర్గంలో బంద్ ఘనవిజయం సాధించింది. ఉదయం 6 గంటల నుంచే బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు సహా అన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బస్సులు కూడా రోడ్డెక్కలేదు. అంబేద్కర్ చౌరస్తా, బస్ డిపో వద్ద బీసీ నేతలు నినాదాలు చేస్తూ ఆచంపల్లి పోస్టాఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాక్ చైర్మన్ గాండ్ల రవీందర్ యాదవ్, వైస్ చైర్మన్ సుధాకర్ చారి, అశోక్ రెడ్డి, బీర్కూర్ శంకర్ (బుజ్జి), సంజీవ్ కుమార్, గంగాధర్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్, ఎం.ఏ. రాజాక్, నాగుల రవిశంకర్ గౌడ్, జిమ్ శ్రీను, శేఖర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bandh successful in Bodhan

More articles

Latest article