25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Must read

📰 Generate e-Paper Clip

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమ పిల్లలకు కానుకగా ఇవ్వాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమాండ్ కంట్రోల్ భవనం సమీపంలో కమిషనర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బి. కోటేశ్వర రావు, అదనపు పోలీస్ కమిషనర్ (ఎ.ఆర్) శంకర్ నాయక్, పోలీస్ కార్యాలయం సూపరింటెండెంటులు, సిబ్బంది, రిజర్వు ఇన్స్పెక్టర్స్, ఆర్.ఎస్.ఐలు, ఐ.టి కోర్ సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Everyone should plant trees

More articles

Latest article