పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమ పిల్లలకు కానుకగా ఇవ్వాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమాండ్ కంట్రోల్ భవనం సమీపంలో కమిషనర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బి. కోటేశ్వర రావు, అదనపు పోలీస్ కమిషనర్ (ఎ.ఆర్) శంకర్ నాయక్, పోలీస్ కార్యాలయం సూపరింటెండెంటులు, సిబ్బంది, రిజర్వు ఇన్స్పెక్టర్స్, ఆర్.ఎస్.ఐలు, ఐ.టి కోర్ సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
