నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని రెండో టౌన్ పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న కైట్ దుకాణాలపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ తెలిపారు. చైనా మాంజా అమ్ముతున్నారన్న నమ్మదిగన సమాచారం ప్రకారం అజామ్ రోడ్డులోని సభాకైట్ దుకాణంపై దాడి చేశామని తెలిపారు. దుకాణం ముందర ఉన్న కారును తనిఖీ చేయగా అందులో నిషేధిత మాంజా ఉన్నట్లు గుర్తించి రతన్ వినోద్, జహీముద్దీన్ ఫారుఖ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 45చరకాల మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు. రూ.15,750 ఉంటుందని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. నిజామాబాద్ పట్టణంలో ఎవరైనా నిషేధిత ప్రాణాంతకమైన చైనా మాంజా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

