నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల అశోక టౌన్ షిప్ లోని ఎమ్మెల్యే నివాసం లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ గత నెల 29న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూపతి రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భూపతి రెడ్డి మాతృమూర్తికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆయన వెంట సీనియర్ నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
