24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నదన్న ముందు జాగ్రత్తలో  భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి నిజామాబాదులోనీ ఎఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ జాకెట్స్, హావర్ సాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉలెన్ జాకెట్స్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  విధి నిర్వహణలో కూడా క్యారీ చేసి అవసరనిమిత్తం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సబ్-ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి , ఆర్ఎస్ఐలు నిషిత్ , సుమన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article