- పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఎస్ఆర్, కాకతీయ, అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో డీఐఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా ఎస్ ఆర్, కాకతీయ, అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. దసరా సెలవుల అనంతరం విద్యార్థులు కళాశాలలకు వస్తె ఫీజులు కట్టలేదని విద్యార్థులను రాత్రి వరకు అమ్మాయిలని చూడకుండా బయట నిల్చో పెట్టీ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. యాజమాన్యాల ఒత్తిడితో హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు బిక్కు బిక్కు భయపడుతూ గడుపుతున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా ప్రతి ఏటా బ్రాంచ్ లను విస్తరించుకొని విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. అనుమతులు లేని ఎస్ఆర్, కాకతీయ, అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలను సీజ్ చేసి యాజమాన్యాలపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా కలెక్టర్ ని కలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు దేవిక, నిఖిల్, మనోజ్, సాయికిరణ్, ప్రసాద్, రతన్, సంతోష్, చరణ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
